Housewife Dressed in BJP Symbols : తల నుంచి కాలి వరకు కమలం గుర్తులే.. బీజేపీపై మహిళ అభిమానం - కమలం గుర్తులను ధరించిన మహళ
🎬 Watch Now: Feature Video
Published : Oct 31, 2023, 5:48 PM IST
Housewife Dressed in BJP Symbols : ఎన్నికలు వచ్చాయంటే చాలు.. తమ పార్టీవైపు ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు నేతలు, కార్యకర్తలు. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీపై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంటున్నారు ఓ మహిళ. తల నుంచి కాలి వరకు బీజేపీ గుర్తైన కమలం పువ్వు ఆకారంలోని ఆభరణాలను ధరిస్తున్నారు. త్వరలో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు ఇందౌర్కు చెందిన గృహిణి సరితా బహరాని.
బొట్టు నుంచి ఉంగరాలు, ముక్కుపుడక, చెవిపోగులు.. ఇలా అన్నీ కమలం గుర్తులే ఉండేలా చూసుకుంటున్నారు సరిత. తాను ధరించే చీర కూడా కాషాయం రంగులో ఉండడమే కాకుండా దానిపై కమలం గుర్తులు కనిపించేలా రూపొందించుకున్నారు. అంతే కాకుండా ప్రతి కార్యక్రమంలో ప్రత్యేకంగా కనిపించేలా కమలం గుర్తును మెహందీ వేసుకుని, సూట్లు ధరిస్తున్నారు. 1983లో పార్టీ చేరిన సరితా.. నాటి నుంచి కమలం గుర్తున్న చీరలనే ధరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీపై సరితకున్న అభిమానాన్ని గుర్తించిన అధిష్ఠానం.. ఆమెకు కార్యాలయ బాధ్యతలను అప్పగించింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కమలం దుస్తులే ధరిస్తూ ప్రచారం చేస్తానని చెబుతున్నారు సరిత. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇవే దుస్తులు ధరిస్తానని తెలిపారు.