రోటీలపై ఉమ్మువేసి తయారీ- నెట్టింట వైరల్, రంగంలోకి పోలీసులు - మక్బుల్ తహారీ హోటల్ వీడియో వైరల్ వీడియో
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-12-2023/640-480-20303754-thumbnail-16x9-uttar-pradesh-hotel-viral-video.jpg)
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Dec 19, 2023, 1:52 PM IST
Hotel Worker Spitting On Roti video viral : ఓ హోటల్లో రోటీలపై ఉమ్మివేసి తయారుచేస్తున్న ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 2023 ప్రపంచకప్ సమయంలో ఈ హోటల్ బిర్యానిపై డిస్కౌంట్ ఇవ్వడం వల్ల వార్తల్లోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
ఖలాపర్ కూడిలికి సమీపంలో మక్బుల్ తహారీ హోటల్ ఉంది. 2023 ప్రపంచకప్ సందర్భంగా బిర్యానీ కొనుగోలుపై ఈ హోటల్ కస్టమర్లకు రాయితీ ఇచ్చింది. అయితే ఈ హోటల్లో పనిచేసే సిబ్బంది ఆహార పదార్థాలను తయారు చేస్తున్న క్రమంలో వాటిపై ఉమ్మివేస్తున్నారనేది ఆరోపణ. ఈ వ్యవహారాన్నంతటిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల వైరల్‌గా మారింది. వీడియోలో రోటీ తయారీదారు తన నోట్లోకి చెయ్యిపెట్టి దానిని రోటీపై ఏదో అంటిస్తున్నట్లుగా ఉంది. 'ఈ వీడియో సోషల్ మీడియాలో మరింత వైరల్‌గా మారడం పట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. విచారణ అనంతరం బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం' అని ముజఫర్ నగర్ ఎస్పీ సిటీ సత్యనారాయణ తెలిపారు.