Heroine Pooja Hegde : హనుమకొండలో బుట్టబొమ్మ సందడి... - సినీ తార పూజా హెగ్డే
🎬 Watch Now: Feature Video
Heroine Pooja Hegde in hanumakonda : హనుమకొండలో ప్రముఖ సినీ తార పూజా హెగ్డే సందడి చేసింది. నగరంలోని ఒల్డ్ పొద్దుటూరి కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన ఒక షాపింగ్ మాల్ ప్రారంభించింది. అనంతరం మాల్‌లో కలియతిరుగుతూ పలు వస్త్రాలను పరిశీలించారు. చీరలు, డ్రెస్‌లను ధరించి సందడి చేశారు. హీరోయిన్‌ని చూడడానికి అభిమానులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో అక్కడ పండగ వాతవరణం నెలకొంది.
పూజా తన అందంతో, డాన్స్‌తో ఎప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది. ఆమెతో సెల్ఫీలు దిగడానికి జనం పోటీ పడ్డారు. చిన్నారులతో, యువతతో కలిసి బుట్టబొమ్మ ఫోటోలు దిగింది. చిన్న సినిమాలతో మొదలైనా పూజా కెరీర్ తెలుగులో అగ్ర నాయకుల సరసన నటించింది. కాగా పూజా తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో నటించారు. తన ముద్దుముద్దు మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బీస్ట్ సినిమా స్టెప్ వేసి అభిమానులను అలరించారు. కొన్ని స్టెప్పులు అభిమానులతో కలిసి వేశారు. వరంగల్‌కి రావడం చాలా ఆనందంగా ఉందని, మీ అభిమానం ఎల్లప్పుడు ఉండాలని కోరారు.