మా నాన్న దగ్గర నుంచే ధైర్యం నేర్చుకున్నాను : బాలకృష్ణ - షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించిన బాలకృష్ణ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 15, 2023, 7:54 PM IST

Hero Balakrishna Open Mart in Sangareddy : ఏదైనా ఒక పనిని సమర్థవంతంగా చేయాలంటే ధైర్యంతోనే ముందడుగు వేస్తానని సినీనటుడు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) తెలిపారు. ఆ ధైర్యం తమ నాన్న నందమూరి తారక రామారావు నుంచి నేర్చుకున్నానని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి(Balakrishna New Shopping Mall Opened) ఆయన ముఖ్య అతిథిగా వెళ్లి ప్రారంభించారు.  

Film Actor Balakrishna Open Shopping Mall in Patancheru : ఆ షాపింగ్‌ మాల్‌ మెుత్తం తిరిగి అక్కడ దొరికే వస్తువులు, దుస్తులను పరిశీలించారు. ప్రజలకు అవసరమయ్యే అన్ని అవసరాలు ఓకే చోట దొరికేలా ఏర్పాటు చేయడం మంచిదని ప్రశంసించారు. ఈ క్రమంలో బాలకృష్ణ వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు, స్థానికులు పెద్ద ఎత్తున మాల్‌ ప్రాంగాణానికి చేరుకున్నారు. దీంతో అక్కడ సందడి వాతావరణం ఏర్పడింది. బాలయ్య అభిమానులు జై బాలయ్య నినాదంతో హోరెత్తించారు. 

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.