హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ - 5 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు - Traffic jam in hyderabad vijayawada highway

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Nov 9, 2023, 12:56 PM IST

Heavy Traffic Jam on Hyderabad-Vijayawada National Highway : హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాల్లో హైవే విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదలడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు అసౌకర్యానికి గురవుతున్నారు.

ఈ రహదారిని నగరంలోని చింతల్‌కుంట కూడలి నుంచి ఆందోల్‌మైసమ్మ (దండు మల్కాపూర్‌) వరకు 6 వరుసల మేర విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి మొత్తం 22.5 కిలోమీటర్ల మేర పనుల్ని రూ.541 కోట్లతో చేపడుతున్నారు. ప్రస్తుతం పెద్ద అంబర్‌పేట, బాటసింగారం, ఇనామ్‌గూడ దగ్గర రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బంది లేకుండా సర్వీసు రోడ్లు ముందు పూర్తి చేసి వాటి మీదుగా వాహనాలను మళ్లిస్తున్నారు. అయితే ఈ మళ్లించే చోట రోడ్లు ఇరుకుగా ఉండటంతో అప్పటివరకూ వేగంగా వచ్చే వాహనాలు నెమ్మదించాల్సి వస్తోంది. దీంతో ఒక్కసారిగా వాహనాలు బారులు తీరుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.