ఇది వడగండ్ల వర్షమా.. లేక గన్ ఫైరింగా..? - కుత్బుల్లాపూర్లో వడగండ్ల వర్షం
🎬 Watch Now: Feature Video
Heavy Hailstorm In Kukatpally: గత రెండు రోజుల నుంచి అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వానలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రం మొత్తం తడిసి ముద్దవుతోంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడుతుంటే.. మరికొన్ని చోట్ల తీవ్రస్థాయిలో వడగండ్లతో వర్షాలు పడుతున్నాయి. వికారాబాద్లో కురిసిన భారీ వడగండ్ల వాన కశ్మీర్లో కురిసే మంచు తుఫానును గుర్తు చేస్తే.. నేడు కూకట్పల్లిలో కురిసిన వడగండ్ల వర్షం పాత విఠలాచార్య సినిమాలలోని బీభత్సాన్ని గుర్తు చేసింది. ఎవరో ఆకాశం నుంచి పెద్ద పెద్ద రాళ్లుతో దాడితో.. బుల్లెట్లతో దాడి చేస్తున్నట్లు.. అచ్చం విఠలాచార్య సినిమాలలో చూసే విధంగా వడగండ్లు పడ్డాయి. అవి పడినప్పుడు ఆ ప్రాంతంలో ఎవరూ లేన్నందున సరిపోయింది లేకపోతే.. పెను ప్రమాదమే జరిగేది. ఇంకా నగరంలోనే కుత్బుల్లాపూర్లో అయితే భారీ వర్షంతో పాటు వడగండ్ల వాహనదారులను, రోడ్లుపై నడిచే వారిని ఇబ్బంది పెట్టాయి. మునుపెన్నడూ చూడలేని విధంగా ఈసారి భారీస్థాయి వడగండ్ల పడడంపై నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు.