నీట మునిగిన హోంమంత్రి ఇల్లు.. బైక్, కూలర్ అన్నీ.. - హరియాణా భారీ వర్షాలు
🎬 Watch Now: Feature Video

Haryana Home Minister Anil Vij House : హరియాణాలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్ విజ్ నివాసం.. నీట మునిగింది. అంబాలాలోని హోం మంత్రి అనిల్ విజ్ ఇంటి ప్రాంగణం.. ఓ పెద్ద చెరువులా తలపిస్తోంది. నగరంలోని అనేక వీధులు నదులను తలపిస్తున్నాయి.
Haryana Ambala Rains : అంబాలా నగరంలో భారీగా వరద నీరు నిలిచిపోయిన కారణంగా NDRF, SDRF బృందాలు.. అక్కడికి చేరుకున్నాయి. వరద నీటిలో చిక్కుకున్న వీరిని తరలించే ప్రక్రియను ప్రారంభించాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా బుధవారం అంబాలాను సందర్శించారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు.
కరెంట్ షాక్కు గురై వ్యక్తి మృతి.. నీటిలో మూడు మృతదేహాలు!
అంబాలాలోని రెసిడెన్షియల్ కాలనీలో బుధవారం ఉదయం.. వరద నీటిలో వెళ్తున్న ఓ వ్యక్తి.. విద్యుత్ తీగ తగిలి కరెంట్ షాక్ గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతడితోపాటు నీటిలో తేలియాడుతున్న మరో మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 15 మంది చనిపోయినట్లు సమాచారం.