Harish Rao Tweet on Telangana Medical Sector : 'ప్రతీ ఉషోదయం.. ఆరోగ్య భాగ్యోదయం' - harish rao on twitter
🎬 Watch Now: Feature Video
Medical and Health day in Telangana Today 2023 : తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఈరోజు వైద్యారోగ్యశాఖ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్ాయి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్న విప్లవాత్మక పథకాలు, వినూత్న కార్యక్రమాలతో ప్రజావైద్యంపై ప్రజల్లో పెరిగిన నమ్మకం పెరిగిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. స్వరాష్ట్రంలో తొమ్మిదేళ్లలో వైద్యారోగ్య రంగం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ట్విటర్ వేదికగా పంచుకున్నారు. స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్ల అనతి కాలంలో తెలంగాణ వైద్యారోగ్య రంగం సాధించిన అద్భుత ప్రగతి ఇదని.. సీఎం కేసీఆర్ మార్గ నిర్దేశంలో దేశానికి రోల్ మోడల్‌గా మారిన ఆరోగ్య తెలంగాణ మోడల్ మనదని కొనియాడారు. స్వరాష్ట్రంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని సీఎం కేసీఆర్ పాలనలో ప్రభుత్వ దవాఖానాలపై ప్రజలకు విశ్వాసం పెరిగిందని చెప్పుకొచ్చారు. "స్వరాష్ట్రంలో ఆరోగ్య సౌభాగ్యం.. ప్రతీ ఉషోదయం ఆరోగ్య భాగ్యోదయం" అని మంత్రి ట్వీట్ చేశారు.