సిద్దిపేటలో కళ్యాణ లక్ష్మీ చెక్కులు, 59 జీవో కింద పట్టాల పంపిణీ - సిద్దిపేటలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-12-2023/640-480-20340538-thumbnail-16x9-harishrao-cheques-distribution.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Dec 23, 2023, 6:51 PM IST
Harish Rao Distributed Kalyana Lakshmi Cheques in Siddipet : సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మీ పథకం కింద 153 చెక్కులు, 59 జీవో కింద 120 మందికి పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, ఇప్పటి వరకు సిద్ధిపేట నియోజకవర్గంలో 11వేల మందికి కళ్యాణ లక్ష్మీ పథకం కింద రూ.93 కోట్ల ఆర్థిక చేయూత అందించామని తెలిపారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి అసరాగా నిలిచామన్నారు.
సిద్ధిపేటలో కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేశామని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని సూచించారు. ఈసారి ఎన్నికల్లో తనని సంపూర్ణ ఆశీస్సులతో దీవించారని ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో ఏ సమస్య ఎదురైనా తన దృష్టి తీసుకురావాలని అన్నారు. జీవో 59 పట్టాల విషయంలో డబ్బులు అడిగితే వారికి తెలియజేయాలని తెలిపారు.