Harish Rao Comments on Congress Party : 'కాంగ్రెస్ ఎస్సీలపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడితే అది మొసలి ప్రేమే' - హరీశ్‌రావు కామెంట్స్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-08-2023/640-480-19377626-thumbnail-16x9-harishrao-comments.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Aug 28, 2023, 5:37 PM IST
Harish Rao Comments on Congress Party and Jagjeevan Ram : గిరిజనుల వెనుకబాటుకు కారణం కాంగ్రెస్ పార్టీనేనని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. బీఆర్ అంబేద్కర్‌ను ఓడించిన పార్టీ కాంగ్రెస్ అని.. అతను చనిపోయాక భారతరత్న ఇవ్వలేదని విమర్శించారు. అలానే జగ్జీవన్‌రామ్ ప్రధాని కాకుండా రాజకీయాలను చేసిందని.. కాంగ్రెస్ ఎస్సీలపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడితే అది మొసలి ప్రేమేనని అగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత కరెంట్ ఉత్త కరెంటు చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్(Congress) మళ్లీ అధికారంలోకి వస్తే ఎరువులు, విద్యుత్ కోతలు ఉంటాయని మండిపడ్డారు. గిరిజనుల కోసం తండాలను పంచాయతీలుగా మార్చారని తెలిపారు. వారి కోసం పది శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్రంలో 24 గంటలు విద్యుత్ వస్తోందని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు జిల్లా పచ్చని కొంగు కప్పుకున్నట్లు రూపుదిద్దుకోందని పేర్కొన్నారు. రైతులకు ప్రభుత్వం శ్రీరామరక్షలాగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. మళ్లీ మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొంత మంది నాయకులు హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.