Gun Firing At Kamareddy : కామారెడ్డి జిల్లాలో కాల్పుల కలకలం... ఒకరికి గాయాలు - కామారెడ్డిలో కాల్పులు ఒకరికి గాయాలు
🎬 Watch Now: Feature Video
Gun Firing At Kamareddy : చేసే పని పట్ల అవగాహన లేకపోయినా.. శ్రద్ధ వహించకపోయినా అది మన ప్రాణానికి లేదా ఇతరుల ప్రాణానికి హాని కలుగజేస్తుంది అంటారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో గన్ పని తీరును వివరిస్తుండగా ప్రమాదవశాత్తు అది పేలిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లాలో కాల్పులు కలకలం రేపాయి. లింగంపేట మండలం శెట్‌పల్లి సంగారెడ్డి గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో ఎయిర్‌గన్ పేలి బోదనపు రాజు అనే యువకుడికి గాయాలయ్యాయి. వ్యవసాయ క్షేత్రంలో శ్రీకాంత్ అనే వ్యక్తి సూపర్ వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో స్నేహితుడైన రాజుకు వ్యవసాయ క్షేత్ర యజమానికి చెందిన ఎయిర్ గన్ పనితీరును వివరిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పేలింది. రాజు వీపు భాగంలో తీవ్ర గాయమైంది. రాజును చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న లింగంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.