వంతెనను ఊపడం వల్లే ప్రమాదం సీసీటీవీ ఫుటేజీ చూశారా - గుజరాత్ వంతెన న్యూస్
🎬 Watch Now: Feature Video
గుజరాత్ మోర్బీలో తీగల వంతెన కుప్పకూలిన దృశ్యాలు సీసీటీవీకి చిక్కాయి. వంతెన కూలిపోవడం, అంతకుముందు జరిగిన పరిణామాలు అందులో రికార్డయ్యాయి. ప్రమాదానికి ముందు బ్రిడ్జిపై భారీ సంఖ్యలో సందర్శకులు కనిపిస్తున్నారు. కొందరు ఆకతాయిలు వంతెన తీగలను పట్టుకొని అటూఇటూ ఊపారు. ఈ క్రమంలోనే వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో దానిపై ఉన్నవారంతా నీటిలో పడిపోయారు. ఈ దుర్ఘటనలో 130 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST