వధువు కోసం హెలికాప్టర్​లో వచ్చిన వరుడు.. తాతయ్య, నానమ్మ కోరిక తీర్చేందుకే

🎬 Watch Now: Feature Video

thumbnail

వధువును తీసుకెళ్లేందుకు హెలికాప్టర్​లో వచ్చాడు వరుడు. తాతయ్య, నానమ్మ కోరిక నెరవేర్చేందుకు మనవడి ఈ ప్రయత్నం చేశాడు. దిల్లీ నుంచి ఓ హెలికాప్టర్​ అద్దెకు తీసుకున్న పెళ్లికొడుకు.. తాతయ్య, నానమ్మలతో కలిసి పెళ్లికూతురు ఊరికి వెళ్లాడు. అనంతరం వధువును హెలికాప్టర్​లో ఎక్కించుకుని ఏడు రౌండ్లు తిరిగాడు. అన్ని కార్యక్రమాలు ముగించుకుని తిరిగి వధువుతో సొంతూరికి బయలుదేరాడు. హెలికాప్టర్​లో వచ్చిన జంటను చూసేందుకు భారీగా ఎగబడ్డారు జనం. రాజస్థాన్​ ​కోటా జిల్లాలోని బంధ ధర్మపురకు చెందిన సునీల్​ అనే వ్యక్తి ఇలా వినూత్నంగా హెలికాప్టర్​లో వచ్చాడు. ఉత్తర్​ప్రదేశ్​లోని ఇటావా పట్టణానికి చెందిన రేఖా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. గురువారం వీరి వివాహం జరిగింది.  

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.