భద్రాద్రి రామయ్య సేవలో గవర్నర్ తమిళిసై - Telangana latest news
🎬 Watch Now: Feature Video

Governor Tamilsai visited Bhadrachalam temple: భద్రాద్రి రామయ్యను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. భద్రాచలంలో జరుగుతున్న పుష్కర పట్టాభిషేక ఉత్సవంలో ఆమె పాల్గొన్నారు. గవర్నర్ ముందుగా ఆలయంలోని సీతారాములను దర్శించుకున్నారు. ఆలయం వద్దకు వచ్చిన గవర్నర్‌కు మేళ తాళాలు పూలమాలలతో ఆలయ ఈవో రమాదేవి ఘన స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలోని మూల వరుల ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు లక్ష్మీ తాయారు అమ్మ వారి ఉపాలయంలో వేద ఆశీర్వచనాలు అందించారు.
గవర్నర్‌ను ఈవో రమాదేవి సన్మానించి స్వామి వారి ప్రతిమను, శేష వస్త్రాలను, ప్రసాదాన్ని అందించారు. మిథిలా స్టేడియంలో జరగుతున్న శ్రీరామ పట్టాభిషేక ఉత్సవంలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. నిన్న శ్రీరామనవమి నాడు సీతారాముల కల్యాణ అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. చినజీయర్ స్వామి కల్యాణ క్రతువులో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు సీతారామ కల్యాణాన్ని వీక్షించారు.