గంటల వ్యవధిలోనే రెండు రైలు ప్రమాదాలు- పట్టాలు తప్పిన గూడ్స్ - తమిళనాడు చెంగల్పట్టులో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
🎬 Watch Now: Feature Video
By PTI
Published : Dec 11, 2023, 12:03 PM IST
Goods Train Derailed : గంటల వ్యవధిలోనే రెండు వేర్వేరు ప్రాంతాల్లో రైళ్లు ప్రమాదాలు సంభవించాయి. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో ఆదివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో గూడ్స్ రైలుకు చెందిన 10 బోగీలు ప్రమాదవశాత్తు పట్టాలు తప్పాయి. చెన్నై హార్బర్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ గూడ్స్ రైలులో ఇనుము సామగ్రితో పాటు మెటల్ షీట్లను రవాణా చేస్తున్నారు. ఈ ప్రమాదంతో పలు ప్యాసెంజర్ రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడినట్లు చెంగల్పట్టు స్టేషన్ అధికారులు చెప్పారు. వెంటనే పట్టాల పునరుద్ధరణ పనులు చేపట్టారు.
మహారాష్ట్రలోనూ పట్టాలు తప్పిన గూడ్స్
మరోవైపు మహారాష్ట్ర ఠాణె జిల్లాలోని కసారాలో కూడా ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు గూడ్స్ రైలుకి చెందిన 7 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టి మెయిన్‌లైన్ రైలు సేవలను తిరిగి ప్రారంభించారు అధికారులు. మిగతా ట్రాక్ పునరుద్ధరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని సీఆర్పీఓ తెలిపారు.
TAGGED:
goods train derailed