లక్ష్మీపూజ స్పెషల్- 24 క్యారెట్ల బంగారు మిఠాయిలు! ధరెంతో తెలిస్తే షాక్! - రాజ్‌కోట్‌లో గోల్డ్ స్వీట్స్
🎬 Watch Now: Feature Video
Published : Nov 11, 2023, 11:34 AM IST
Gold Sweet in Gujarat : దీపావళి సందర్భంగా గుజరాత్‌లోని ఓ స్వీట్ల దుకాణం.. 24 క్యారెట్ల బంగారు పూతతో మిఠాయిలను తయారు చేసింది. ఈ స్వీట్ల ధర కేజీ రూ.12వేలుగా నిర్ణయించింది. ఈ స్వీట్‌ను ప్రత్యేకంగా లక్ష్మీ పూజలో ఉపయోగించేందుకు తయారు చేస్తున్నారు.
రాజ్‌కోట్ జిల్లా ధోరాజీలోని గౌతమ్ స్వీట్స్.. ప్రత్యేకంగా బంగారు పూతతో మిఠాయిలను తయారు చేసింది. ఈ స్వీట్స్‌లో జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్నట్, అంజీర వంటి ఐదు రకాల డ్రైఫ్రూట్స్‌ను ఉపయోగించింది. దానిపై నుంచి తినగలిగే బంగారాన్ని పూత వేస్తారు. లక్ష్మీపూజ కోసం ఈ స్వీట్‌ను వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని షాపు యజమాని చెబుతున్నారు. 'పూజలో ఉంచటం వల్ల లాభాలు కలుగుతాయని వ్యాపారుల నమ్మకం. అలానే ఒక కేజీ కొనలేని వారు లక్ష్మీ పూజ కోసం 250 గ్రాముల స్వీట్‌ను కొనుగోలు చేయవచ్చు. బంగారు పూతతో చేసిన స్వీట్ మెుదటి సారిగా ఇక్కడే తయారు చేశాం' అని స్వీట్ షాపు యజమాని వీరభాయ్ వసానియా తెలిపారు.