మనిషిని పోలిన ముఖంతో జన్మించిన మేకపిల్ల- చూసేందుకు ప్రజల క్యూ! - మేకపిల్ల వైరల్ వీడియో
🎬 Watch Now: Feature Video
Published : Dec 14, 2023, 6:17 PM IST
Goat Born With Human Face Viral Video : మనిషిని పోలిన ముఖంతో మేకపిల్ల జన్మించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో జరిగింది. ఈ మేక పిల్లకు రెండు కళ్లు తలకు ముందు భాగంలోనే ఉన్నాయి. మాల్వీ జాతికి చెందిన తన మేక రెండు పిల్లలకు జన్మనివ్వగా అందులో ఒకటి ఈ వింతైన ఆకారంతో కనిపించిందని దాని యజమాని అన్వర్ తెలిపాడు. రెండింటిలో ఓ మేకపిల్ల కళ్లు ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయని అతడు వివరించాడు. దానికి రాణి అని పేరు పెట్టినట్లు చెప్పాడు.
ఈ విషయాన్ని పశువైద్యుల దృష్టికి తీసుకువెళ్లారు స్థానికులు. అయితే జన్యు సమస్యల వల్లే ఇలా జరిగి ఉంటుందని పశువైద్యులు తెలిపారు. సాధారణంగా ఇలా జన్మించిన జంతువులు అనారోగ్యంగా ఉంటాయనీ కొంత కాలమే జీవిస్తాయని వెల్లడించారు. అయితే ఈ మేకపిల్ల మాత్రం ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉందని వివరించారు. ఈ విషయం తెలిసి మేకపిల్లను చూసేందుకు చందన్ నగర్‌లోని అన్వర్ ఇంటివద్దకు చాలా మంది చేరుకున్నారు. మధ్యప్రదేశ్‌లో ఇలాంటి మేకపిల్ల జన్మించడం ఇది రెండోసారి అని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.