'IAS​ కావాలనేది నా పేరెంట్స్ కల.. ఈ విజయం మా అమ్మకే అంకితం' - యూపీఎస్సీ 2023 టాపర్​ గరిమా లోహియా ఇంటర్వ్యూ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 23, 2023, 9:00 PM IST

Updated : May 24, 2023, 8:59 AM IST

'మా నాన్న చనిపోయారు.. అమ్మే పెంచిపోషించింది. ఆమె సహకారంతోనే ఈ రోజు UPSCలో ఉత్తమమైన ర్యాంక్​ సాధించాను. అమ్మ ప్రోత్సాహం లేకుంటే ఈ రోజు పరీక్షల్లో టాపర్​గా నిలిచేదాన్ని కాదేమో!'.. యూపీఎస్​సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా రెండో ర్యాంక్ సాధించిన గరిమా లోహియా అన్న మాటలివి. బిహార్​ బక్సర్​ జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన గరిమ సాధించిన ఘనత పట్ల ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

అయితే సివిల్స్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన గరిమా లోహియా ఎటువంటి కోచింగ్​ ఇన్స్టిట్యూట్​లకు వెళ్లలేదు. కేవలం సెల్ఫ్​ ప్రిపరేషన్​తోనే ఆల్​ ఇండియా రెండో ర్యాంక్​ను సాధించడం విశేషం. పరీక్షల సన్నద్ధతకు సంబంధించి తాను ముందుగా ప్రాథమిక పుస్తకాలతో తన ప్రిపరేషన్​ను మొదలుపెట్టానని.. అంతేగాక యూట్యూబ్​ వీడియోల సాయం కూడా తీసుకున్నట్లుగా గరిమా తెలిపారు.

"నేను ఐఏఎస్​ ఆఫీసర్​ కావాలనేది నా తల్లిదండ్రుల కల. బక్సర్​ పట్టణంలోని వుడ్ స్టాక్ స్కూల్ నుంచి నా ప్రాథమిక విద్యను పూర్తి చేశాను. దిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్​లో పట్టా పొందాను. 2020 కొవిడ్​-19 విజృంభణ సమయంలో ఇంటికి తిరిగి వచ్చి.. అందరూ ఎంతో కష్టంగా భావించే సివిల్ సర్వీసెస్​ పరీక్షలకు సన్నద్ధం కావడం ప్రారంభించాను. ఈ సివిల్ సర్వీసెస్​ పరీక్షలకు సిద్ధం కావాలనే పట్టుదలను నాలో ప్రేరేపించింది మా అమ్మ ఆకాంక్షే. మొత్తంగా సివిల్స్​ పరీక్షల్లో టాపర్​గా నిలవడానికి మా అమ్మ నాకెంతో తోడ్పాటునందించింది. ఆమె ఎంతలా సహకారం అందించిందంటే.. అమ్మ కూడా పరీక్షలకు ప్రిపేర్​ అవుతున్నారా అన్నట్లుగా అనిపించింది" అని గరిమా లోహియా ఈటీవీ భారత్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.

Last Updated : May 24, 2023, 8:59 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.