Ganesh Nimajjanam at Saroor Nagar Lake : సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన కోలాహలం.. నెలకొన్న భక్తుల రద్దీ - సరూర్‌నగర్ చెరువులో గణేశ్ నిమజ్జనాలు
🎬 Watch Now: Feature Video
Published : Sep 28, 2023, 7:40 PM IST
Ganesh Nimajjanam at Saroor Nagar Lake : రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా తీన్మార్ బ్యాండ్, డీజే సౌండ్‌లో.. భక్తుల నృత్యాలతో సందడి వాతావరణం కనబడుతోంది. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన కోలాహలం నెలకొంది.
Ganesh Immersion 2023 in Rangareddy Dist : చుట్టుపక్కల నుంచి భారీగా తరలివస్తున్న భక్తులతో సరూర్ నగర్ మిని ట్యాంక్‌బండ్ రద్దీగా మారింది. సరూర్‌నగర్ పరిధిలోని చెరువు వద్దకు వస్తున్న వినాయకులను క్రేన్లతో.. ఎప్పటికప్పుడు నిమజ్జనం చేస్తున్నారు. మరోవైపు నగరంలో ఓ పక్క వర్షం కురుస్తున్నప్పటికీ.. నిమజ్జన శోభ యాత్ర కొనసాగుతోంది. బషీర్‌బాగ్‌లో వర్షంలో కురుస్తున్నప్పటికీ నిమజ్జనం కోసం సాగర్‌కు గణనాథులు తరలి వెళుతున్నాయి. శోభాయాత్రను చూడటానికి భక్తుల పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వర్షం తాకిడికి ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారు. ఏకధాటిగా వాన పడుతున్న ఉత్సాహంగా నిమజ్జనాన్ని కొనసాగిస్తున్నారు. విభిన్న రకాల వినాయకుల భక్తులకు విశేషంగా ఆకట్టుకున్నాయి.