Friends Win Lottery In Punjab : స్నేహితులను వరించిన అదృష్టం.. లాటరీలో రూ.కోటిన్నర జాక్‌పాట్ - పార్టనర్‌షిప్‌లో లాటరీ గెలిచిన స్నేహితులు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-10-2023/640-480-19667800-thumbnail-16x9-friends-win-lottery-in-punjab.jpg)
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Oct 3, 2023, 11:13 AM IST
Friends Win Lottery In Punjab : పంజాబ్.. ఫాజిల్కా జిల్లాలో ఇద్దరు స్నేహితులు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోయారు. పార్టనర్‌షిప్‌లో రూ.100కు లాటరీ టికెట్ కొని.. రూ.కోటిన్నర బంపర్ ప్రైజ్‌మనీని గెలుచుకున్నారు. లాటరీ విక్రయ కేంద్రం వద్ద బ్యాండు వాయిద్యాలకు డ్యాన్స్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇదీ జరిగింది.. జిల్లాలోని అబోహర్ టౌన్‌కు చెందిన రమేశ్, కుకీ స్నేహితులు. వీరిద్దరూ పార్టనర్‌షిప్‌లో గత కొన్నేళ్లుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. చాలా సార్లు చిన్న చిన్న బహుమతులు గెలుచుకున్నారు. అయితే ఇటీవల రెండు రూ.100 టికెట్లు పార్టనర్‌షిప్‌లోనే కొనుగోలు చేశారు. లాటరీ ఫలితాలు ఆదివారం రాత్రి విడుదల కాగా.. ఓ టికెట్‌కు రూ.కోటిన్నర లాటరీ తగిలింది. దీంతో రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోయారు. దీంతో పొద్దున్నే ఘంటాఘర్ చౌరస్తాలోని జ్ఞాన్‌చంద్ లాటరీ విక్రయం కేంద్రం వద్దకు బ్యాండుతో వచ్చారు. బ్యాండు దరువుకు డ్యాన్స్ చేస్తూ కోలాహలం చేశారు. అయితే ఈ లాటరీ డబ్బును తమ పిల్లల కోసం, కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చుచేస్తామని రమేశ్, కుకీ తెలిపారు.