బంపర్ ఆఫర్.. పద్యం చెబితే పెట్రోల్ 'ఫ్రీ' - తమిళనాడు తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video

'పద్యం చెప్పండి.. ఉచితంగా లీటరు పెట్రోల్ పొందండి' అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది తమిళనాడు తిరునెల్వేలిలోని ఓ పెట్రోల్ బంక్ యాజమాన్యం. తిరువళ్లువర్ రాసిన తిరుక్కురల్లోని ఏదైనా పద్యం చెప్పిన వారికి ఫ్రీగా పెట్రోల్ పోసింది. స్థానికంగా ఉండే తిరువళ్లువర్ కళగం ఆరో వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఈ పోటీ నిర్వహించింది. తిరువళ్లువర్ రచనలపై ప్రచారం కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు స్థానికులు ఆసక్తి చూపారు. తిరుక్కురల్లోని పద్యం చెప్పి ఉచితంగా పెట్రోల్ పొందారు.