Foundation Laying of New Excise Station Building at Hayatnagar : హయత్‌నగర్‌లో నూతన ఎక్సైజ్‌ స్టేషన్‌ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి - తెలంగాణ తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 8, 2023, 8:35 PM IST

Foundation Laying of New Excise Station Building at Hayatnagar : ప్రపంచంలో తెలంగాణకు ప్రత్యేక స్థానాన్ని కల్పించడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని.. ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. రంగారెడ్ది జిల్లా హయత్‌నగర్‌లో నూతన ఎక్సైజ్‌ స్టేషన్‌ భవనానికి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆనాటి ప్రభుత్వాలు ఆదాయం వచ్చే శాఖలను అభివృద్ధి చేసే ప్రయత్నం చేయలేదని శ్రీనివాస్​గౌడ్​ విమర్శించారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు తెలంగాణలో ఎందుకు పుట్టామని బాధపడేవారని.. కానీ ఈనాడు మనం తెలంగాణలో పుట్టినందుకు అదృష్టంగా భావించాలన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కుల వృత్తులను గౌరవిస్తూ ఆత్మగౌరవ భవనాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. అప్పటి ప్రభుత్వాలు ఎక్సైజ్ శాఖను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఆదాయంపై ప్రశ్నించినందుకు కేసులు పెట్టారని గుర్తు చేశారు. అక్రమ మద్యం, రవాణాపై దృష్టి సారించాలని ఎక్సైజ్‌ అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. బాగా పని చేసిన అధికారులకు ప్రమోషన్​లు కేటాయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.