Forstens Cat Snake Viral Video : ఇంట్లోని టేబుల్‌పై అరుదైన పాము.. అచ్చం పిల్లి కళ్లులానే!.. వీడియో చూశారా? - ఫోర్స్టెన్స్ క్యాట్ స్నేక్ వైరల్ వీడియో
🎬 Watch Now: Feature Video


Published : Sep 22, 2023, 10:31 AM IST
Forstens Cat Snake Viral Video : దేశంలో అనేక రకాల పాములు ఉన్నప్పటికీ.. కొన్ని మాత్రమే ప్రజలకు కనిపిస్తుంటాయి. మరికొన్ని దట్టమైన అడవుల్లో ఉంటాయి. అలాంటి వాటిలో ఓ అరుదైన పాము.. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ప్రత్యక్షమైంది. జిల్లాలోని పుత్తూరు బల్నాడుకు చెందిన రవికృష్ణ కల్లాజే ఇంట్లోని టేబుల్‌పై 'ఫోర్స్టెన్స్ క్యాట్ స్నేక్' పాము పాకింది.
రవికృష్ణ కల్లాజే.. గురువారం ఏదో పని చేసుకుంటూ తన టేబుల్‌వైపు చూశాడు. అదే సమయంలో పసుపు రంగులో ఉన్న పామును గుర్తించాడు. వెంటనే స్థానికులకు విషయం తెలియడం వల్ల అంతా చూసేందుకు వచ్చారు. అది 'ఫోర్స్టెన్స్ క్యాట్ స్నేక్' పాముగా గుర్తించారు. అదే గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ తేజస్ బన్నూరు.. విషయం తెలుసుకుని రవికృష్ణ ఇంటికి చేరుకున్నాడు. అరుదైన పామును రక్షించి అడవుల్లో విడిచిపెట్టాడు. ఫోర్స్టెన్స్ క్యాట్ స్నేక్ అరుదుగా కనిపిస్తుంటుందని తెలిపాడు. ఇప్పటి వరకు తాను పది వేలకు పైగా పాములను రక్షించినట్లు పేర్కొన్నాడు.
పశ్చిమ కనుమల వంటి దట్టమైన అడవుల్లో ఈ పాము అరుదుగా కనిపిస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఈ పాము కళ్లు.. పిల్లి కళ్లులానే ఉండడం వల్ల ఫోర్స్టెన్స్ క్యాట్ స్నేక్ అని పేరు వచ్చినట్లు చెప్పారు. అయితే ఈ పాము కాటు వేయడం వల్ల ఎలాంటి ప్రాణ హాని ఉండదని తెలిపారు.