నగల షాపులోకి పోటెత్తిన వరద.. రూ.2కోట్ల విలువైన ఆభరణాలు మాయం! - బెంగళూరు లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Floods In Bangalore : కర్ణాటకలోని బెంగళూరులో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి నగరంలోని వాగులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో మల్లీశ్వర్ ప్రాంతంలోని నిహాన్ జ్యువెల్లరీ అనే నగల దుకాణంలోకి భారీగా వరద నీరు ప్రవేశించింది. దీంతో షాపులో ఉన్న రూ.2 కోట్ల విలువైన నగలు కొట్టుకుపోయానని నిహాన్ జ్యువెల్లరీ యజమాని ప్రియ తెలిపారు. చెత్తాచెదారంతో నీరు ఉద్ధృతిగా ప్రవహించడం వల్ల దుకాణం షట్టర్లను మూయలేకపోయామని ఆయన చెప్పారు.
'దుకాణంలోని బంగారం ఆభరణాలు తడిసిపోయాయి. మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి సాయం కోరినా స్పందించలేదు. దుకాణంలో ఉన్న 80 శాతం నగలు అంటే దాదాపు రూ.2 కోట్ల విలువైన నగలు వరదలో కొట్టుకుపోయాయి' అని నిహాన్ జ్యువెల్లరీ యజమాని ప్రియ కన్నీంటి పర్యంతమయ్యారు. మరోవైపు.. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలో రోడ్లు గుంతలుగా మారాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మహాలక్ష్మి లేఅవుట్ పరిధిలో 20 ఇళ్లు ముంపునకు గురైనట్లు సమాచారం. నగరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు బెంగళూరు మున్సిపల్ సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు.