బంగారు తీగలను.. క్రేన్‌తో పట్టేశారు - Types of fish
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18163689-1042-18163689-1680586961364.jpg)
Fishing with a crane: చేపలు పట్టడం అంటే మీలో ఎంత మందికి ఇష్టం.. మీరు చిన్నప్పుడు మీ ఊరు చెరువులో చేపలు పట్టానికి వెళ్లారా..! బురదలో చెేపలు కోసం పరిగెడుతూ.. పడిపోయిన సందర్భాలు ఉన్నాయా..! దొరికిన చేపను పట్టుకున్నాకా ఆ ఆనందమే వేరు... ఎందుకంటే చేపల వేట అంటే చిన్న పిల్లలు మొదలుకొని పండు ముసలి వరకు ఇష్టపడని వారు ఉండరు. చేపలు పట్టడం ఒక ఆర్ట్.. కొందరు చిన్న చిన్న వలలతో దొరికిన చేపలను బుట్టలో వేసుకుంటారు. మరికొందరు గేలం తయారీ చేసి చేపకు ఎర వేసి మరి దానిని పట్టుకుంటారు. మరి పెద్ద పెద్ద చెరువుల్లో అయితే వలతో పట్టిన చేపలను ట్రేలలో వేసి మరో వాహనంలో ఎక్కిస్తారు.. కానీ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలోని ఊర చెరువులో చేపలు పట్టేందుకు జాలర్లు క్రేన్ వినియోగించారు. చెరువులో నీటి శాతం ఎక్కువగా ఉండి నిండుకుండలా మారడంతో మూడేళ్లుగా చేపలు పట్టడం సాధ్యపడలేదు. దాంతో చేపలు పెద్దవిగా మారాయి. వలలు వినియోగించడం సాధ్యపడకపోవడంతో.. జాలర్లు ఇలా క్రేన్ సాయంతో చేపలను పట్టడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఇలా సుమారు 30 టన్నులకు పైగా సేకరించినట్లు చేపలను పట్టినట్లు జాలర్లు తెలిపారు.