ఫైర్​మ్యాన్​ దేశభక్తి.. మంటలు చుట్టుముట్టినా జాతీయ జెండా కోసం రిస్క్ - ఫైర్​మెన్​ సునీల్​ పానిపట్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 18, 2023, 4:00 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

అగ్నిప్రమాదానికి గురైన భవనంపై ఉన్న జాతీయ జెండాను జాగ్రత్తగా కిందకు తెచ్చేందుకు ఓ ఫైర్​మ్యాన్ భారీ సాహసం చేశారు. మంటలు చుట్టుముడుతున్నా అగ్నిమాపక శాఖ ఉద్యోగి సునీల్ ధైర్యంగా భవనంపైకి ఎక్కారు. దట్టమైన పొగ మధ్య కర్రకు కట్టి ఉన్న త్రివర్ణ పతాకాన్ని ఊడదీసి కిందకు తీసుకొచ్చారు. హరియాణా పానిపత్​లోని ఓ స్పిన్నింగ్ మిల్ దగ్గర మంగళవారం జరిగిన ఈ ఘటన దృశ్యాలను చూసి నెటిజన్లు సునీల్​పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ ప్రమాదంలో స్పిన్నింగ్ మిల్ మొత్తం దగ్ధం కాగా 5 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది.

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.