నిప్పులపై నడుస్తూ పడిపోయిన పూజారి.. మంటలు చెలరేగి... - గ్రామ ఉత్సవాలు
🎬 Watch Now: Feature Video
Fire walking ceremony: కర్ణాటక రామనగర జిల్లా హరూర్ గ్రామంలో నిర్వహించిన ఉత్సవాల్లో అపశ్రుతి దొర్లింది. నిప్పులపై నడిచే కార్యక్రమంలో ఓ పూజారి తీవ్రంగా గాయపడ్డారు. నదీశ్ అనే పూజారి.. దైవాన్ని తలుచుకుంటూ ఊగిపోయారు. నిప్పులపై నుంచి పరుగెడుతూ పడిపోయారు. దీంతో దుస్తులకు మంటలు అంటుకున్నాయి. వెంటనే లేచి బయటకు పరిగెట్టిన పూజారిని చెన్నపట్టణ్ తాలూకా ఆసుపత్రికి తరలించారు. భగభగ మండే నిప్పులపై పడటం వల్ల శరీరానికి తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. మంగళవారం జరిగిందీ ఘటన.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST