జగిత్యాల జిల్లాలో భారీ అగ్నిప్రమాదం - లక్షల్లో ఆస్తి నష్టం - కోరుట్లలో అగ్ని ప్రమాదం
🎬 Watch Now: Feature Video
Published : Jan 10, 2024, 11:37 AM IST
Korutla Fire Accident Today : జగిత్యాల జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోరుట్ల పట్టణంలోని గడి గురుజు వద్ద గల ఓ సామిల్ దుకాణంలో తెల్లవారు జామున మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దుకాణంలో అన్ని రకాల కర్రలు పెద్ద ఎత్తున నిలువ ఉండడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. జనావాసాల మధ్యనే షాప్ ఉండడంతో ఎగిసి పడుతున్న మంటలను చూసి చుట్టుపక్కల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఆ ప్రాంతమంతా పొగలు వ్యాపించాయి. వెంటనే వారు సమాచారాన్ని అగ్నిమాపకశాఖ అధికారులకు స్థానికులకు అందించారు. హుటహుటిన ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
Fire Accident in Jagtial District : ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటి వరకు ఎగిసిపడిన మంటలు కాస్త తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాలిపోయిన కర్ర విలువ లక్షల్లో ఉంటుందని తెలుస్తుంది. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.