Farmers Fight Over Farm Path Video Viral : పొలం బాట విషయంలో ఘర్షణ.. ఒకరు మృతి.. వీడియో వైరల్ - గుగులోతు వాచ్యా పొలం ఇస్యూ
🎬 Watch Now: Feature Video
Published : Sep 27, 2023, 12:25 PM IST
Farmers Fight Over Farm Path Video Viral in Suryapet : పొలం బాట విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ ఓ వ్యక్తి ప్రాణాలు బలి తీసుకుంది. ఈ ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం చింతల పాలెంలోని పొలం బాట విషయంలో ఇరువర్గాల మధ్య రెండు రోజుల క్రితం ఘర్షణ జరిగింది. ఈ గొడవల్లో గుగులోతు వాచ్యా అనే వ్యక్తి కుటుంబంపై విచక్షణారహితంగా మరో వర్గం వారు దాడికి తెగబడ్డారు
Argument in Land Issue Suryapet : ఈ దాడిలో గుగులోతు వాచ్యా తలకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతున్న వాచ్యా.. ఈరోజు ఉదయం సుమారు మూడు గంటల సమయంలో మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు, ఒక బాలుడు ఉన్నారు. ఈ దాడిలో గాయాలైన మిగిలిన వారిని మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. గొడవ పడిన విజువల్స్ సీసీ కెమెరాల్లో చిక్కాయి. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.