Farmers Brought Crocodile Electricity Office : కరెంట్ ఆఫీస్కు మొసలితో రైతులు.. అర్ధరాత్రి ఇబ్బంది పెడుతున్నారని నిరసన
🎬 Watch Now: Feature Video
Farmers Brought Crocodile Electricity Office : వ్యవసాయానికి రాత్రివేళ మాత్రమే కరెంట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ కర్ణాటకలో రైతులు వినూత్నంగా ఆందోళన చేశారు. విజయపుర జిల్లా కొల్హారా తాలుకాలోని రోనీహల్ గ్రామానికి చెందిన రైతులు.. ఓ మొసలిని విద్యుత్ కార్యాలయానికి తీసుకొచ్చి నిరసన తెలిపారు. సరైన సమయానికి కరెంట్ ఇవ్వకపోవడాన్ని ప్రశ్నిస్తూ అధికారులతో వాగ్వాదానికి దిగారు అన్నదాతలు. రాత్రివేళ కరెంట్ సరఫరా చేయడం వల్ల పొలాల్లో వన్యప్రాణులతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని రైతులు చెబుతున్నారు.
గురువారం రాత్రి పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లగా.. ఓ రైతుకు మొసలి కనిపించింది. ఆ మొసలిని పట్టుకున్న రైతులు.. హుబ్బళ్లి విద్యుత్ సరఫరా కంపెనీకి చెందిన స్థానిక కార్యాలయానికి ట్రాక్టర్లో తీసుకొచ్చారు. 'అర్ధరాత్రి సమయంలో అధికారులు త్రీ ఫేజ్ కరెంట్ ఇస్తున్నారు. ఆ సమయంలో మేం పొలాలకు వెళ్లి నీరు పారించుకోవాల్సి వస్తోంది. మొసళ్లతో పాటు అనేక వన్యప్రాణులు అక్కడ ఉంటున్నాయి. మాకు ఏదైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారు? రాత్రి వేళ కరెంట్ ఇస్తే మాకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా అదనపు సమస్యలు ఎదురవుతున్నాయి. మా సమస్యలను అర్థం చేసుకుంటారని అధికారుల వద్దకు మొసలిని తీసుకొచ్చాం' ఓ రైతు వివరించారు. చివరకు రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు.. రైతులను సముదాయించి మొసలిని విడిపించి తీసుకెళ్లారు.
వరి పొలంలో 9 అడుగుల మొసలి.. చెట్టుపై ఎలుగుబంటి
Man Feeding Crocodile Viral Video : మొసలికి ఆహారం తినిపించిన వ్యక్తి!.. నది ఒడ్డున కూర్చుని..