Villa Marie farewell day celebrations : ఆకట్టుకునే అందాలతో... విల్లా మేరి ఫేర్‌వెల్ డే - విల్లా మేరీ కాలేజీలో హస్త లా విస్తా కార్యక్రమం
🎬 Watch Now: Feature Video
Villa Marie farewell day celebrations : కళాశాల వేడుకలంటే విద్యార్థుల కోలహలం అంతా ఇంతా కాదూ. తోటి విద్యార్థులతో కబుర్లు.. సెల్పీలతో తమ జ్ఞాపకాలను పదిలం చేసుకుంటూ ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. ఇక అమ్మాయిలతే చెప్పనక్కరలేదు. సంప్రదాయ, ఆధునిక వస్త్రాలంకరణతో ఆకర్షించారు. హైదరాబాద్ సోమాజిగూడలోని విల్లామేరీ కళాశాలన ఫేర్‌వెల్ డే వేడుకల్లో అమ్మాయిలు అదరగొట్టారు. 'హస్త లా విస్తా' పేరుతో నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థినీలు తమ ఆట పాటలతో ఆకట్టుకున్నారు. విద్యార్ధినీలు చేసిన నృత్య ప్రదర్శనలు, ర్యాంప్ వాక్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అమ్మాయిలు సంప్రదాయ, పాశ్చాత్య నృత్యాలతో వేదికను హోరెత్తించారు. సినీ గీతాలకు విద్యార్థులు చేసిన నృత్యాలకు తోటి విద్యార్థులు కేరింతలు కొడుతూ డాన్స్ చేస్తూ ఉత్సాహపరిచారు. ప్రతి ఏడాది నిర్వహించే విల్లామేరీ మిస్ అందాల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డిగ్రీ విద్యార్థులు కళాశాల వదలి వెళ్తుంటే చాలా బాధగా ఉందని విల్లామేరీ డిగ్రీ కళాశాల కార్యదర్శి చిన్నమ్మ అన్నారు. ప్రెషర్స్ పార్టీలు, ఫేర్‌వెల్ పార్టీలు... ఇలా సందర్భాలు వేరైనా ఉత్సహం ఒక్కటే. ఆటైనా, పాటైనా సై.. ఏదైనా తమదైన ముద్ర ఉండాలని అంటున్నారు విల్లామేరీ కళాశాల విద్యార్థినీలు. కేవలం చదువు మాత్రమే కాదూ విద్యార్థుల ప్రతిభను చాటుకునేందుకు ఇలాంటి వేదికలు ఉండాలంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.