చార్మినార్ రైలు ప్రమాదంలో గాయపడ్డవారికి ఆర్థిక సాయం! - Charminar Express train

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 10, 2024, 3:56 PM IST

Face2Face With Railway CPRO on Nampally Train Accident : ఇవాళ నాంపల్లి రైల్వేస్టేషన్‌లో జరిగిన ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులకు రైల్వేశాఖ తక్షణ ఆర్థికసాయం అందజేసింది. లాలాగూడ రైల్వే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన అధికారులు పరిహారం అందజేశారు. రైల్వే స్టేషన్‌లో ఐదో ప్లాట్ ఫాంలో ప్రమాదం చోటుచేసుకోవడంతో దానిపై నుంచి రైళ్ల రాకపోకలు నిలిపివేసి, పునరుద్ధరణ పనులు చేపట్టారు.  

Interview on Charminar Express train accident : ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కోసం విచారణ చేపట్టి అధికారులు చర్యలు తీసుకొనున్నారు. ఘటనపై ఇప్పటికే అధికారులు, రవాణా శాఖ మంత్రి ఆరా తీయగా, అధికార యంత్రాంగం సహాయక చర్యలపై దృష్టి సారించాలని సూచించారు. ఈ ప్రమాదం జరుగుతున్నప్పుడు రైలు ఎంత వేగంలో ఉన్నదనేది విచారణలో తేలనుంది. గాయపడిన ప్రయాణికుల పరిస్థితి అనుసరించి వారికి మరికొంత ఆర్థిక సాయం అందచేయనున్నారు. మరికొన్ని గంటల్లో రైళ్ల రాకపోకలు యథావిధిగా ఉంటాయంటున్న రైల్వే సీపీఆర్‌వోతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.