Ex Minister krishna Yadav Joins in Bjp : కాషాయ గూటికి చేరేందుకు సిద్ధమైన మాజీ మంత్రి కృష్ణ యాదవ్ - తెలంగాణ తాజా రాజకీయాలు
🎬 Watch Now: Feature Video
Published : Aug 30, 2023, 7:18 PM IST
|Updated : Aug 30, 2023, 7:49 PM IST
Ex Minister krishna Yadav Joins in Bjp : బీఆర్ఎస్ నేత.. మాజీ మంత్రి కృష్ణ యాదవ్ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఏడేళ్లు పార్టీ కోసం పని చేసిన తనను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్.. తాను ఒకే మంత్రివర్గంలో పని చేశామని, తెలంగాణ రాష్ట్రంపై స్పష్టమైన అవగాహన ఉందన్నారు. తెలంగాణలోని అట్టడుగు బలహీన వర్గాలకు సేవ చేయాలనే ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు.
ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లిలో తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. రెండు, మూడు రోజుల్లో బీజేపీలో చేరుతున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ తనను గుర్తించలేదని.. అందుకే పార్టీ మారుతున్నట్లు పేర్కొన్నారు. టికెట్ ఇస్తామని.. బీఆర్ఎస్ రెండుసార్లు మోసం చేసిందన్నారు. తన సేవలను బీఆర్ఎస్ పార్టీ వినియోగించుకోలేదని వెల్లడించారు. గతంలో ప్రజల మధ్య ఉన్నానని.. ఇప్పుడు కూడా ఉంటానని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం మచ్చ లేకుండా పరిపాలిస్తుందని.. రాబోయే ఎన్నికల్లో అధిష్ఠానం నిర్ణయమే శిరసా వహిస్తానని పేర్కొన్నారు. అయితే ఈరోజు బీజేపీలో చేరేందుకు నాంపల్లి రెడ్ రోజ్ ఫంక్షన్లో కృష్ణా యాదవ్ సన్నాహాలు చేసుకున్నా.. పార్టీకి చెందిన అగ్రనేతలు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో చివరి నిమిషంలో చేరిక తాత్కాలికంగా ఆగిపోయింది.