Pratidwani : ఎన్నికల విధుల నిర్వహణలో అధికారుల పాత్ర ఎలా ఉండాలి? - తెలంగాణ ఎన్నికలు
🎬 Watch Now: Feature Video
Published : Oct 12, 2023, 9:48 PM IST
రాష్ట్రంలో ఒక్కసారిగా కొరఢా ఝళిపించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏకంగా... ఎన్నికల వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న 20 మంది అధికారులపై చర్యలు తీసుకుంది. నలుగురు కలెక్టర్లు, హైదరాబాద్ సహా ముగ్గురు పోలీసు కమిషనర్లు, 10 మంది ఎస్పీలు, ఆబ్కారీశాఖ డైరెక్టర్, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్, రవాణాశాఖ కార్యదర్శి వంటి కీలక అధికారులపై వేటు వేసింది ఈసీ. అంతేకాక ఎవరూ ఊహించని రీతిలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు వారికి ఎలాంటి బాధ్యతలు కూడా అప్పగించ వద్దని కఠిన ఆదేశాలు ఇచ్చింది. ఈసీ అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. గత వారం 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన తరువాత ఈసీ నుంచి ఈ ఉత్తర్వులు వచ్చాయి. అసలీ ఈ చర్యలకు కారణం ఏమిటి? విపక్షాల ఫిర్యాదులే ఇందుకు కారణమా..?, ఎన్నికల విధుల్లో అధికారుల పాత్రతో పాటు... ఈ ఎన్నికల్లో సవాల్‌గా మారిన ప్రలోభాల కట్టడి ఎలా?, తెలంగాణలో ఎన్నికల్లో ధన ప్రవాహం ఎలా ఉండబోతోంది.. అనే అంశాలపై నేటి ప్రతిధ్వని.