విద్యార్థుల ఆత్మహత్యలు ఆపలేమా...? - మెడికోల మానసిక ఒత్తిడికి కారణమేంటి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 1, 2023, 9:08 PM IST

etv pratidwani discussion: ఆపదలో ప్రాణం కాపాడాల్సిన భావి వైద్యులే.. అర్థాంతరంగా తనువు చాలించడం ఆందోళన కలిగిస్తోంది. స్వల్ప వ్యవధిలో వరస ఘటనలు సమస్య తీవ్రతపై కలవర పెడుతున్నాయి. ఇలా దేశవ్యాప్తంగా అయిదేళ్లలో 119మంది వైద్య విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారంటున్నాయి గణాంకాలు. దేశంలోనే ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలుగా ఉన్న ఐఐటీలు, ఐఐఎం, ఎన్‌ఐటీల్లోనూ ఇదే దయనీయమైన పరిస్థితి. డాక్టర్ పట్టా చేతిలో పట్టుకొని వైద్య సేవలు అందించాల్సిన విద్యార్థులు... అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. తల్లిదండ్రులకు గర్భశోకాన్ని కలిగిస్తున్నారు. ఇందులో ఎవరి ఒత్తిడి వారిని ఈ పరిస్థితుల్లోకి నెడుతోంది అంటే స్పష్టమైన కారణం కనిపించడం లేదు. మన విద్యా వ్యవస్థలో లోపాలే ఇందుకు కారణమని భావించాలనే సమస్య ఇప్పుడు అందరి ముందు ఉత్పన్న మవుతున్న ప్రశ్న. మరి అసలు మెడికోల మానసిక ఒత్తిడికి కారణమేంటి? వారిని బలవన్మరణాల దిశగా... నెడుతున్న అంశాలు ఏమిటి? ఈ ఒత్తిళ్ల పొత్తిళ్ల నుంచి విద్యార్థులు బయటపడాలంటే కళాశాలల్లో ఎలాంటి మార్పులు చేపట్టాలి? తల్లిదండ్రులు, బంధుమిత్రులు, స్నేహితుల నుంచి వీరి ఎలాంటి మద్దతు అవసరం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.    

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.