Pratidwani : ఉపాధ్యాయుల హేతుబద్దీకరణ... సవాళ్లు - ఉపాధ్యాయుల హేతుబద్దీకరణ అంశం
🎬 Watch Now: Feature Video
Pratidwani : రాష్ట్రంలో ఉపాధ్యాయుల హేతుబద్దీకరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అందుకోసం అన్ని జిల్లాల డీఈవోలు... గత బుధవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయంలో... అదనపు సంచాలకులు, ఆర్‌జేడీల ఆధ్వర్యంలో జిల్లాలు, పాఠశాలల వారీగా, విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? ఎక్కువ మంది టీచర్లు ఉన్నారా? తక్కువ ఉన్నారా? అని పరిశీలించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నాళ్లు గానో ఉన్న సమస్య ఇది. ఎన్ని ప్రభుత్వాలు, ఎంత మంది అధికారులు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపెట్టలేకపోతున్నారు. డిజిటలైజేషన్ జరిగిన తరువాత వివరాలు తెలుసుకోవడం చాలా సులువు. జిల్లా యూనిట్‌గా ఉన్న పాఠశాలలు, ఒక్కో స్కూల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య క్షణాల్లోనే తెలిసిపోతుంది. అయినా కూడా రేషనలైజేషన్ సమస్య ఎందుకు వస్తుందో అంతు పట్టడం లేదు. కేవలం కొందరి నిర్లక్ష్యమే దీనికి కారణమనుకోవచ్చా.. అసలు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య ఎంత? రేషనలైజేషన్‌పై ఉపాధ్యాయుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? రేషనలైజేషన్ వల్ల పాఠశాల విద్యలో ఎలాంటి మార్పులొస్తాయి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.