Robotics Service in Hyderabad : రోబోటిక్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా హైదరాబాద్ - Robotics Service in Hyderabad
🎬 Watch Now: Feature Video
Robotics Service in Hyderabad : రోబోటిక్స్.. ప్రస్తుత ప్రపంచం అందుకుంటున్న ఎమర్జింగ్ టెక్నాలజీలో ఒకటి. ఎంతో ఉజ్వల భవిష్యత్తున్న రోబోటిక్స్ రంగంలో త్వరలోనే మానవుల సహకారంతో పని చేసే అధునాతన రోబోల వినియోగం పెరగనుంది. ఇప్పటికే ఐటీ హబ్‌గా పేరొందిన హైదరాబాద్.. రానున్న రోజుల్లో రోబోటిక్స్‌కూ కేరాఫ్ అడ్రస్‌గా మారనుంది. ఇటీవల ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా దేశంలోనే తొలి రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంతో పాటు రోబోటిక్స్ అంకురాలకు సహకరిస్తూ రోబోటిక్స్‌కు హైదరాబాద్‌ను హబ్‌గా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆల్ ఇండియా రోబోటిక్స్ అసోసియేషన్‌తో కలిసి తెలంగాణ ప్రభుత్వం ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్‌ను ప్రారంభించింది. ఈ ఫ్రేమ్‌వర్క్‌తో రాష్ట్రంలో రోబోటిక్స్ వ్యవస్థను మరింతగా మెరుగుపరచనున్నట్లు ఐరా సీఈఓ కిషన్ చెబుతున్నారు. యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని చెబుతున్న రోబోటిక్ ఫ్రేమ్ వర్క్ గురించి మరిన్ని విషయాలను మనకు తెలియజేస్తున్న ఐరా సీఈఓ కిషన్‌తో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం.