Pratidwani పుతిన్ సమరనాదం ఎలాంటి పర్యవసనాలు మోసుకురానుంది - prathidwani debate on russia ukraine war
🎬 Watch Now: Feature Video
హెచ్చరికలు పని చేయలేదు. ఆంక్షల భయాలు అడ్డు కాలేదు. చివరకు అంతర్జాతీయ సమాజం భయపడుతున్నదే జరిగింది. ఉక్రెయిన్‌కు చెందిన దొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖేర్సన్ అనే నాలుగు ప్రాంతాలను తమలో విలీనం చేసుకుంటున్నట్లు ప్రకటించారు.. రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్. అంతేకాదు.. విలీన ప్రాంతాలు సహా తమ మాతృభూమిని కాపాడుకునేందుకు అందుబాటులో ఉన్న ఏ అవకాశం వదులుకోబోం అంటూ పశ్చిమదేశాలపై తుది సమరనాదం చేశారు. మరి ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీయనున్నాయి? ఐక్యరాజ్యసమితి కూడదు అన్నా, యూరోపియన్ యూనియన్ తగదు అని హితవు చెప్పినా.. గుర్తించేది లేదని అమెరికా కారాలు మిరియాలు నూరినా.. పుతిన్ ఈ విలీన చర్య ఎలాంటి పర్యవసనాలు మోసుకుని రానుంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST