PRATHIDWANI రాష్ట్రంలో సాదాబైనామాలక్రమబద్ధీకరణకు ఎందుకిన్ని అడ్డంకులు
🎬 Watch Now: Feature Video
PRATHIDWANI: సాదాబైనామాల క్రమబద్ధీకరణకు మోక్షం కల్పిస్తామని మూడేళ్ళ క్రితం ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది. కానీ ఆ ప్రక్రియ ముగిసి దరఖాస్తుదారులకు భూమిహక్కులు దక్కేది, ఎప్పుడు.. ఎలా అన్నదే అంతుచిక్కడం లేదు. ప్రభుత్వ ప్రకటనతో ఏళ్ళుగా అపరిషృతంగా ఉన్న తమ సమస్య తీరబోతోందని గంపెడాశలతో లక్షలాదిమంది రైతులు దరఖాస్తు చేసుకొన్నారు. అయితే భూమి సాగులోనే ఉన్నప్పటికీ క్రమబద్ధీకరణ చేపట్టకపోవడంతో క్రయవిక్రయాల్లో సందిగ్ధత కొనసాగుతోంది. క్రమబద్ధీకరణకు అవకాశం ఉన్న ఆర్వోఆర్ చట్టం రద్దు.. నూతన రెవెన్యూ చట్టంలో విధివిధానాలు లేకపోవడంతో 8లక్షలకు పైగా రెతుల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో క్రమబద్ధీకరణకు ఎందుకిన్ని అడ్డంకులు? రెవెన్యూ చట్ట సవరణ జరిగేనా? దరఖాస్తుదారులకు ఉన్న మార్గం ఏంటి? అసలు రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST