శ్రీ రాముడిలో వ్యక్తిత్వవికాస, మేనేజ్‌మెంట్ గుణాలను గుర్తించారా..! - ETV ప్రతిధ్వని చర్చ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 30, 2023, 10:36 PM IST

Prathidwani: రామో విగ్రహవాన్ ధర్మ:.. రాముడి గురించి చెప్పాలన్న ఏ సందర్భంలోనైనా ఇదేమాటతో ప్రారంభిస్తుంటారు. దానికి కారణం ఏమిటో తెలుసా? తనను తాను మానవుడిగా ప్రకటించుకున్న రాముడు.. దేవుడెందుకయ్యాడు? ఆ శ్రీరామచంద్రుడు ఎందుకు అంత ప్రత్యేకం? ఆయనను ఆదిపురుషుడు, ఆదర్శప్రాయుడిని చేసిన సుగుణాలు.. ఆ శ్రీరామచంద్రుడి జీవితం నుంచి.. ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన విషయాలేమిటి? మరీ ముఖ్యంగా ధర్మం, న్యాయం, నీతి, మంచి, మర్యాద, విలువలు, నైతికతకు నిలువుటద్దంగా నిలిచిన శ్రీరాముడు చెప్పిన రాజధర్మం ఏమిటి? సాక్షాత్ ఆ శ్రీరారాచంద్రమూర్తే భరతుడికి చెప్పిన రాజనీతిజ్ఞత, రాజధర్మాలు ఏమిటి? రాముడు చెప్పిన రాజధర్మంలో నేటి పాలకులు ఏమేం గమనించాలి? రాజు స్థానంలో ఉండేవారు ప్రజలపై తీసుకునే నిర్ణయాలెలా ఉండాలి? ఏ పాలకుడు అయినా దీన జన సంరక్షణలో ఎలా వ్యవహరించాలి? ఆ ఆదర్శమూర్తి నుంచి నేటితరం నేర్చుకోవాల్సిన వ్యక్తిత్వవికాస, మేనేజ్‌మెంట్ పాఠాలు ఏమిటి? రామాయణం నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన, పాటించాల్సిన అంశాలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.  

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.