కర్ణాటక శాసనసభ ఎన్నికల నగారా.. కన్నడ ఓటరునాడిని నిర్ణయించే అంశాలు ఏమిటి? - ETV Bharat prathidwani debate Karnataka elections

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 31, 2023, 9:11 PM IST

Prathidwani: ఎదురుచూస్తున్న ఎన్నికల ప్రకటన రానే వచ్చింది. దక్షిణభారతంలో అత్యంతకీలకమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికలసంఘం. 2024 సార్వత్రిక సమరానికి దగ్గరవుతున్న తరుణంలో వచ్చిన ఈ ఎన్నికల ప్రకటన... అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌తో పాటు అక్కడి రాజకీయ పక్షాలు అన్నింటికీ అగ్ని పరీక్షగానే కనిపిస్తోంది. బీజేపీ - కాంగ్రెస్ మధ్య హోరాహోరీ అన్న అంచనాలు ఉన్నా.. మధ్యలో జేడీఎస్ పాత్ర ఏమిటి? జాతీయ రాజకీయాల్లోకి కొత్తగా అడుగిడిన బీఆర్​ఎస్ ఉనికి చాటుకుంటుందా? కన్నడ ఓటరునాడిని నిర్ణయించే అంశాలు ఏమిటి? సాధారణంగా కర్ణాటక అంటేనే కులాలు, మఠాలు.. ఈసారి ఆ విషయంలో సమీకరణాలెలా ఉన్నాయి? కాంగ్రెస్‌పార్టీకి విజయావకాశాలు ఎలా ఉన్నాయి? రాహుల్‌పై అనర్హతవేటు ఏమైనా ప్రభావం చూపిస్తుందా? ఇదే ఏడాది రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌.. తెలంగాణల్లోనూ రానున్న శాసనసభల ఎన్నికలు జరగనున్నాయి. ఆ కోణంలో కర్ణాటక ఎన్నికల ప్రాధాన్యత ఏమిటి? జాతీయ రాజకీయాలపై ఆ ప్రభావం ఎలా ఉండబోతోంది? ఇదే అంశాలపై నేటి ప్రతిధ్వని. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.