PrathiDwani: చాప కింద నీరులా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారి
🎬 Watch Now: Feature Video
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ చాప కింద నీరులా వ్యాపిస్తుండటం కలవరపెడుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు అమాంతం పెరుగుతున్నాయి. మరణాలూ నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు 24 గంటల వ్యవధిలో 6,155 మంది కొవిడ్ బారిన పడగా.. పాజిటివిటీ రేటు 5% దాటింది. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వైరస్ వ్యాపిస్తున్న ప్రాంతాలను గుర్తించి దాని కట్టడికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. కనుమరుగైపోయింది అనుకుంటున్న తరుణంలో మళ్లీ ఎందుకీ కరోనా డేంజర్ బెల్స్. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? దేశంలో రాబోయే కొన్ని వారాల్లో కేసులు మరింతగా పెరుగుతాయనే అంచనాలు కూడా ఉన్నాయి... ప్రస్తుతం దేశవ్యాప్తంగా పరీక్షల సీజన్ కూడా నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొవిడ్ కేసుల పెరుగుదల సంకేతాలతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.