ETV Bharat / technology

గేమింగ్ లవర్స్​కు బ్యాడ్ న్యూస్- ఇండియాలో సోనీ ప్లేస్టేషన్‌ పీఎస్ 5ప్రో లాంచ్ రద్దు- ఎందుకో తెలుసా?

'సోనీ మోస్ట్ పవర్​ఫుల్ ప్లేస్టేషన్ ఇండియాలో లాంచ్ చేయట్లేదు'- గేమింగ్ లవర్స్​కు షాకిచ్చిన కంపెనీ!

Sony PlayStation
Sony PlayStation (Sony)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 10, 2024, 7:13 PM IST

Sony PlayStation: గేమింగ్ లవర్స్​కు బ్యాడ్​ న్యూస్. సోనీ మోస్ట్ పవర్​ఫుల్ ప్లేస్టేషన్ ఇండియాలో లాంచ్ చేయట్లేదని కంపెనీ వెల్లడించింది. నియంత్రణ పరిమితుల కారణంగా సోనీ ప్లే స్టేషన్ 5 ప్రో భారతదేశానికి రావడం లేదని ఎలక్ట్రానిక్స్ దిగ్గజం స్పష్టం చేసింది. కంపెనీ PS5 ప్రో ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో మొదటిసారిగా మార్కెట్లోకి పరిచయం చేసింది. ఇందులో అడ్వాన్స్​డ్​ రే-ట్రేసింగ్, AI అప్‌స్కేలింగ్ క్యాపబిలిటీస్​ సపోర్ట్​తో పవర్​ఫుల్ గ్రాఫిక్స్ చిప్‌ను అమర్చారు.

"6GHz వైర్‌లెస్ బ్యాండ్‌ని ఉపయోగించే కొన్ని దేశాల్లో (ప్రస్తుతం ఇండియాతో సహా) PS5 ప్రో అందుబాటులో ఉండదు. IEEE 802.11be (Wi-Fi 7) ఇంకా అనుమతులు లభించలేదు." అని సోనీ తెలిపింది.

కాగా గేమర్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎంతో కాలంగా ఎదురు చూడగా ఇటీవలే సోనీ PS5 ప్రోని గ్లోబల్ మార్కెట్‌కు పరిచయం చేసింది. అనుభవజ్ఞులైన గేమర్లు లేదా కొత్తగా ఈ తరహా ఆన్‌లైనింగ్‌ గేమ్స్‌ ఆడేందుకు ఆసక్తిగా ఉన్నవాళ్ల కోసం అదిరిపోయే ఫీచర్లతో దీన్ని ఆవిష్కరించింది. కంపెనీ దీన్ని పీఎస్ 5 అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా తీసుకొచ్చింది. రే ట్రేసింగ్‌, ఏఐ అప్‌స్కేలింగ్‌ కెపబిలిటీ ఉండేలా, పవర్​ఫుల్ గ్రాఫిక్స్‌ చిప్‌ను ఇందులో అమర్చారు. అయితే ఈ ప్లేస్టేషన్‌ను భారత్‌లో ప్రారంభించబోమని సోనీ తెలిపింది. అయితే ఇది ప్రస్తుతం ఎంపిక చేసిన మార్కెట్లలో $699.99కి రిటైల్ అవుతుంది.

"మేము తయారు చేసిన కన్సోల్‌లలో ఇది మోస్ట్‌ పవర్‌ ఫుల్‌. సాధారణ పీఎస్‌ 5తో పోలీస్తే గ్రాఫిక్స్ రెండరింగ్‌లో PS5 ప్రో 45 శాతం వేగంగా పనిచేస్తుంది. పనితీరు మోడ్‌లో AAA టైటిల్స్​ను హ్యాండిల్ చేసేందుకు దీన్ని తీసుకొచ్చాం" అని సోనీ ప్లేస్టేషన్ సిస్టమ్ ఆర్చిటెక్ట్‌ మార్క్‌ సెర్నీ పేర్కొన్నారు.

కంపెనీ లిమిటెడ్ ఎడిషన్ ప్లేస్టేషన్ 5, ఇప్పుడు ఇండియాలో అందుబాటులో ఉన్న యాక్ససరీస్​ను ప్రకటించింది. లిమిటెడ్ ఎడిషన్ PS5 గ్రే కలర్‌లో వస్తుంది. దీని ఒరిజినల్ ప్లేస్టేషన్ 1994లో ప్రారంభించారు. ఈ ఏడాది డిసెంబర్‌లో 30వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకోనున్న పాపులర్ కన్సోల్ సిరీస్‌కు సీక్వెల్ విడుదలైంది. ఇప్పటికే PS5 ఉన్నవారికి PS5 30వ వార్షికోత్సవ లిమిటెడ్ ఎడిషన్‌లో ఎక్కువ ఆప్షన్స్​ అందుబాటులో ఉండవు.

చిన్నారులు రోజులో మూడు గంటలు బాని'సెల్'- సర్వేలో షాకింగ్ విషయాలు!

ఐటెల్ నుంచి కొత్త స్మార్ట్​ఫోన్లు- తక్కువ ధరలో ఊహకందని ఫీచర్లతో లాంచ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.