ETV Bharat / technology

చిన్నారులు రోజులో మూడు గంటలు బాని'సెల్'- సర్వేలో షాకింగ్ విషయాలు! - EFFECTS OF MOBILE PHONE ON CHILD

మీ పిల్లలకు స్మార్ట్​ ఫోన్​ ఇస్తున్నారా?- అయితే ఈ ముప్పు తప్పదట..!

Children Internet Usage Survey
Children Internet Usage Survey (ETV Bharat)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 10, 2024, 4:27 PM IST

Children Internet Usage Survey: ప్రస్తుతం స్మార్ట్​ఫోన్ల వినియోగం అంతకంతకూ పెరిపోతోంది. సోషల్ మీడియాకు అతుక్కుపోయి చిన్నారులు సైతం బానిసలుగా మారుతున్నారు. దీంతోపాటు గేమింగ్స్, ఓటీటీ ప్లాట్​ఫారమ్స్​లో ఎక్కువ కాలం గడుపుతున్నారు. దీంతో పిల్లల ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయని, వారిలో కోపం, అసహనం, బద్ధకం పెరిగిపోతున్నాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోకల్‌సర్కిల్స్‌ సంస్థ నిర్వహించిన ఆన్​లైన్​ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

దేశంలోని 368 పట్టణ జిల్లాలకు చెందిన 9-17 ఏళ్ల పిల్లల తల్లిదండ్రులు 70,000 మంది నుంచి అభిప్రాయాలు సేకరించి ఈ నివేదిక రూపొందించినట్లు ఆ సంస్థ తెలిపింది. సోషల్ మీడియా, వీడియోలు, ఓటీటీ యాప్స్, ఆన్‌లైన్‌ గేమ్స్‌ కోసం రోజుకు సగటున 3 గంటల నుంచి అంతకంటే ఎక్కువ సమయాన్నే తమ పిల్లలు వెచ్చిస్తున్నారని 47% మంది తల్లిదండ్రులు తెలిపారు. మరికొంతమంది పిల్లలు రోజులో 6 గంటలకు మించి సమయం వెచ్చిస్తున్నారని 10% మంది తల్లిదండ్రులు వెల్లడించారు. తమ పిల్లలు సోషల్ మీడియాకు ఎడిక్ట్ అయిపోయారని 66% మంది పట్టణ తల్లిదండ్రులు విశ్వసిస్తున్నారు.

వీటి వినియోగం వల్ల పిల్లల్లో కోపం, అసహనం, బద్ధకానికి దారితీస్తున్నాయని 58% మంది పేరెంట్స్ భావిస్తున్నారు. మొబైల్‌తో అధికంగా గడపడం వల్ల పిల్లల్లో దూకుడు పెరిగిందని 58% మంది తల్లిదండ్రులు తెలిపారు. అసహనంగా ఉంటున్నారని 49% మంది, బద్ధకస్థులుగా మారారాని 49% మంది, నైరాశ్యానికి దారితీస్తున్నాయని 42% మంది, అధిక కోపం కనిపిస్తోందని 30% మంది వెల్లడించారు. అయితే వీటి వల్ల తమ పిల్లలు సంతోషంగా ఉంటున్నారని 19% మంది, సామాజికంగా చురుగ్గా ఉంటున్నారని 4% మంది తల్లిదండ్రులు అంటున్నారు.

'పేరెంట్స్ అనుమతి ఉండేలా చూడాలి': 18 ఏళ్ల లోపు వయసున్న పిల్లలు సామాజిక మాధ్యమాలను వినియోగించాలంటే తల్లిదండ్రుల అనుమతి ఉండేలా కొత్త డేటా భద్రతా చట్టాన్ని రూపొందించాలని 66% మంది పేరెంట్స్ అభిప్రాయపడ్డారు. ఆధార్‌ ధ్రువీకరణ ద్వారా మాత్రమే సోషల్ మీడియాలో పిల్లలకు అనుమతి ఇవ్వాలని 33% మంది తల్లిదండ్రులు సూచిస్తున్నారు.

ఐటెల్ నుంచి కొత్త స్మార్ట్​ఫోన్లు- తక్కువ ధరలో ఊహకందని ఫీచర్లతో లాంచ్!

వాహన ప్రియులకు గుడ్​న్యూస్- ఓలా ఎలక్ట్రిక్ నుంచి 20 కొత్త ప్రొడక్ట్స్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.