Prathidhwani: ఎన్నికల్లో అంతులేని ఉచిత హామీలకు అడ్డుకట్ట పడేదెప్పుడు? - etv bharat prathidhwani discussion
🎬 Watch Now: Feature Video
ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు గుప్పిస్తున్న అసాధారణ హామీలపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. ఆచరణ సాధ్యం కాని హామీలిస్తున్న పార్టీలను అదుపు చేయడంలో కేంద్రం ఎందుకు మెతకవైఖరి అవలంభిస్తోందని ప్రశ్నించింది. ఉచిత హామీల విషయంలో ఎన్నికల సంఘం ఇప్పటికే చేతులెత్తేయడంతో ఈ విషయంలో ఆర్థిక సంఘంతో చర్చించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. అసలు రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఇబ్బడి ముబ్బడిగా ఉచిత పథకాల హామీలను ఎందుకు ప్రకటిస్తున్నాయి? ఈ హామీల భారం అంతిమంగా ఎవరిపై పడుతుంది? ఆర్థికంగా సాధ్యాసాధ్యాలను పట్టించుకోకుండా ఎడాపెడా హామీలిస్తున్న పార్టీలను నియంత్రించేది ఎవరు? ఇదే అంశంపై ఈ రోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST