TU VC reaction: 'ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వర్శిటీకి ఈ పరిస్థితి వచ్చింది' - వీసీ ప్రొ రవీందర్
🎬 Watch Now: Feature Video
Telangana University VC Interview: తెలంగాణ విశ్వవిద్యాలయంలో వీసీ వర్సెస్ ఈసీ అన్నట్లుగా మారింది వివాదం. ఇంచార్జి రిజిస్ట్రార్‌ను తొలగిస్తూ.. వీసీ చేసిన ఖర్చుల మీద విచారణకు కమిటీని ఏర్పాటు చేస్తూ పాలక మండలి తీర్మానాలు చేసింది. ఆ పాలక మండలి చేసిన తీర్మానాలు చెల్లనవిగా.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని వీసీ ప్రొ. రవీందర్ పేర్కొన్నారు. ఈ వివాదం మొత్తానికి కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్‌నే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. పాలక మండలి నియమించిన రిజిస్ట్రార్‌గా ప్రొ. యాదగిరి నియామకం చెల్లదని కోర్టు తెలిపింది. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ప్రకారం రిజిస్ట్రార్‌గా ఆయన కుర్చీలో కూర్చోవడానికి అర్హత లేదని వీసీ అంటున్నారు. గతంలో వీసీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. అక్రమ నియామకాలు జరగలేదని.. అనుమతి లేకుండా ఖర్చులు చేయలేదని.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వర్శిటీకి ఈ పరిస్థితి వచ్చిందని అంటున్న తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొ. రవీందర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.