Kautilya School Of Public Policy: రాజకీయాల్లో వస్తామంటున్న యువత.. భవిష్యత్ మొత్తం తమదేనట - కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ
🎬 Watch Now: Feature Video

సమాజంలోని ఆర్థిక, సమాజిక అంతరాలను రూపుమాపేందుకు తాము ప్రయత్నిస్తామని కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ విద్యార్థులు స్పష్టం చేశారు. పబ్లిక్ పాలసీ తయారీకి నిపుణులను.. భవిష్యత్‌కు సరైన రాజకీయ నాయకులను అందిచాలన్న లక్ష్యంతో గీతం విశ్వవిద్యాలయం కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీని ఏర్పాటు చేసింది. రెండు సంవత్సరాల శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులు.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులు మీదగా పట్టాలు అందుకున్నారు. రాజకీయాలే పాలసీ మేకింగ్‌కు పునాది అని.. జనాల సమస్యలు తెలుసుకుంటేనే విధానాలు రూపొందించగలమని యువత అంటున్నారు. ప్రతి ఒక్క రంగంలోనూ నూతన పాలసీలు అవసరమని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువత చెపుతున్నారు. భవిష్యత్తులో పాలసీ మేకింగ్ అడ్వైజర్లుగా ఉంటామని విద్యార్ధులు వెల్లడించారు. విద్య, వ్యవసాయ రంగాల్లో దేశంలో నూతన పాలసీ అవసరం.. ప్రజల జీవితాల్లో మార్పు తేవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తాం అంటున్న నవ పాలసీ తయారీదారులు.. భవిష్యత్ రాజకీయ నాయకులతో ఈటీవీ భారత్ ముఖాముఖి.