రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ముంచుకు రాబోతున్నాయా - ETV Bharat Pratidwani latest News
🎬 Watch Now: Feature Video
మునుగోడు పోరు ముగిసినా తెలంగాణలో రాజకీయ అగ్గి రాజుకుంటూనే ఉంది. రోజురోజుకీ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయే తప్ప చల్లారట్లేదు. సవాళ్లు, ప్రతిసవాళ్ల దగ్గరి నుంచి భౌతిక దాడుల వరకూ తెలంగాణ రాజకీయాగ్ని సెగలు రేపుతోంది. చూస్తున్న ప్రజల్లో గుబులు పుట్టిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విచారణ సంస్థలు వీటికి మరింత వేడిని జోడిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే తుపాన్ ముందు అలజడిలాగా ముందస్తు ఎన్నికలు ముంచుకు రాబోతున్నాయా, ఈ పరిణామాలకు కారణాలేంటి, ఇవి ఎటు మలుపు తీసుకుంటాయి, అనేది నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST