Etela Comments on Kaushik Reddy : 'మాపై చేసే వేధింపులకు సీఎం ప్రోద్భలం ఉంది' - తెలంగాణ విశేషాలు
🎬 Watch Now: Feature Video
Etela Rajender Fires on Padi Kaushik Reddy : హుజురాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ ఒక మతిస్థిమితంలేని వ్యక్తిని ఎమ్మెల్సీగా పెట్టిందని పాడి కౌశిక్‌రెడ్డిపై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విరుచుకుపడ్డారు. జనగామ జిల్లా నిడిగొండలో ముదిరాజులతో ఈటల రాజేందర్ సమావేశం అయ్యారు. అనంతరం ఈటల మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గంలో మతిస్థిమితంలేని వ్యక్తిని ఎమ్మెల్సీగా పెట్టడం వల్లే నియోజకవర్గంలో కుల, మతం అని చూడకుండా అన్ని వర్గాల ప్రజలపై బెదిరింపులు, దాడులు, కిడ్నాప్‌లు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇలాంటి వాటికి పాల్పడుతుంటే సీపీకి పిర్యాదు చేశామని పేర్కొన్నారు. తనలాంటి వ్యక్తులకు కూడా సుపారీ ఇచ్చేంత పరిస్థితి నియోజకవర్గంలో ఏర్పడిందని అన్నారు. తమ సహనం, ఓపిక నశిస్తే హుజురాబాద్ నడి చౌరస్తాలో చెప్పుల దండ వేసి తిప్పుతామని హెచ్చరించారు. తనపై పాడి కౌశిక్‌రెడ్డి చేసే వేధింపులకు సీఎం కేసీఆర్ ప్రోద్భలం ఉందని ఆరోపించారు. నియోజకవర్గంలో కౌశిక్‌రెడ్డి లాంటి వ్యక్తుల వల్ల బీఆర్ఎస్ కార్యకర్తలపై కూడా దౌర్జన్యాలు జరుగుతున్నాయని అన్నారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజలు గమనిస్తున్నారని వారే కర్రుకాల్చి వాత పెడుతారని చెప్పారు.