అధిష్ఠానం ఆదేశిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తా : ఈటల రాజేందర్ - బీఆర్ఎస్ పై ఈటెల రాజేందర్ ఫైర్
🎬 Watch Now: Feature Video
Published : Dec 19, 2023, 9:57 PM IST
Etela Rajender about MP Elections : పార్టీ ఆదేశిస్తే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో ఆయన మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదంతో ముందుకు వెళ్తామని ఈటల రాజేందర్ అన్నారు. పోటీ చేయాలా వద్దా, ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని తెలిపారు. వ్యక్తుల పట్ల పార్టీ దగ్గర అపారమైన సమాచారం ఉంటుందన్నారు. 2021 ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పగబట్టారని ఆరోపించారు.
Etela Rajender Fires on BRS : కేసీఆర్ ఎమ్మెల్యే హక్కులను హరించారని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. గెలిచిన ఎమ్మెల్యే బాధ్యతలను నిర్వర్తించకుండా అడ్డుకున్నారన్నారు. జిల్లా నుంచి నియోజకవర్గ స్థాయి అధికారులకు ఆంక్షలు విధించారని ఆరోపించారు. నాడు కల్యాణలక్ష్మి చెక్కులపై సంతకాలు చేసేది తానైతే, పంపిణీ చేసేది బీఆర్ఎస్ వాళ్లన్నారు. ఎక్కడ అధికారికమైన కార్యక్రమాలను నిర్వహించలేకపోయామని గుర్తు చేశారు. ప్రభుత్వం పగబట్టిందన్నారు. ప్రజాస్వామ్య వ్వవస్థలో ఇంతటి చీకటి పరిపాలన చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని విమర్శించారు.